![]() |
![]() |
.webp)
జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు. ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్. అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.
కొన్ని రోజుల క్రితం వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని ఏడుస్తూ ఓ వ్లాగ్ చేసిన ప్రియాంక.. ఇప్పుడు దానికి కంటిన్యూ చేస్తూ మరో వ్లాగ్ చేసింది. అయితే ఇలా వ్లాగ్స్ చేయడానికి కారణం చెప్పుకొచ్చింది ప్రియాంక జైన్. మీరు ఇలా సింపతీ పేరుతో జనాలని మానిపులేట్ చేస్తున్నారని చాలామంది అంటున్నారు. కానీ మేమ్ ఏదైనా ప్రోగ్రామ్ గానీ సీరియల్ గానీ చేస్తేనే మాకు డబ్బులు వస్తాయి. మేము ఇలా కన్పిస్తేనే కదా ఈ వీడియోలని జనాలు చూసేది మాకు డబ్బులు వచ్చేవి. మీరు ఆఫీస్ లకి ఎలా వెళ్తారో మేము ఇలాగే కన్పిస్తాం.. మాకు వచ్చేది ఈ యూట్యూబ్ నుండే కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేదు. దయచేసి మా పరిస్థితిని అర్థం చేస్కోండి. ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయకండి అని ప్రియాంక జైన్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.
ప్రియాంక యూట్యూబ్ ఛానెల్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. నా కళ్ళకి సర్జరీ వళ్ళ మీ ముందుకు రాలేకపోతున్నానంటూ రీసెంట్ గా చేసిన వ్లాగ్ ఫుల్ వైరల్ అవ్వగా.. ' నాకు ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాలేదని ' వీడియోని షేర్ చేసి ఇందులో తన బాధనంతా వివరించింది ప్రియాంక. కాగా ఇప్పుడు ఈ వీడియోకి అందరు పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో పాటుగా తమకి తోచిన సలహాలు ఇస్తున్నారు.
![]() |
![]() |